Friday, April 19, 2024

పట్టభద్రులు చూపు.. టిఆర్‌ఎస్ వైపు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Participated in MLC election campaign

మల్కాజిగిరి: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేసి వాతలు పెట్టినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలా? అసలు బిజెపికి ఎందుకు ఓటు వేయాలి అని? రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. గురువారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధ్యక్షతన ఆనంద్‌బాగ్ బృంధవాన్‌గార్డెన్‌లో జరిగిన ఎమ్మల్సీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్‌రావు మాట్లాడుతూ… హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధిని సురభి వాణి దేవి ఎంపికతోనే ఆమె గెలుపు ఖాయమైందన్నారు.

పట్టభధ్రులంతా టిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని, బిజెపికి ఓటు వేసేందుకు ఇక్కడి పట్టభద్రులు సిద్ధ్దంగా లేరన్నారు. ఆరు ఏళ్లు ఎమ్మెల్సీగా పని చేయాలని పట్టం కడితే బిజెపి అభ్యర్ధి రాంచందర్‌రావు 2018లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపిగా పోటీ చేశారని, ఒక వేళ ఎమ్మెల్యే, ఎంపిగా గెలిచి ఉంటే, ఎమ్మెల్సీ పదవిని మధ్యలోనే వదలేసి వెళ్లి పోయే వారని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి అన్నా, పట్టభధ్రులు అన్నా చాలా చిన్న చూపు ఉందని విమర్శించారు. అంత చిన్న చూపు ఉంటే ఎందుకు మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయని ఆ రాష్ట్రానికి రూ లక్షకోట్లు కేటాయించారని, అదే తెలంగాణకు బడ్జెట్‌లో కోత విధించారని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి కోతలు, ప్రజలకు వాతలు పెట్టిన బిజెపికి ఓటు వేస్తారా? కోట్లు వెచ్చించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధ్దికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారో విజ్ఞులైన పట్టభధ్రులు ఆలోచించుకోవాలన్నారు.

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థ్ధి రాంచందర్‌రావు ఆరు ఏళ్లులో ఒక్క సారి కూడా తన మొఖం చూపించ లేదని ఇటీవల తాండూరు, పరిగి, వికరాబాద్‌కు వెళితే అక్కడి పట్టభధ్రులు తనకు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. అసలు బిజెపికి ఎందుకు ఓటు వేయాలి? ప్రభుత్వ రంగ సంస్థ్ధలన్నీ ప్రైవేటు పరం చేస్తున్నందుకా..? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మొండిచెయ్యి చూపినందుకా..? తెలంగాణ రాష్ఠ్రానికి వచ్చిన ఐటీఆర్‌ను రద్దు చేసి, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినందుకా..? ఎస్సి,ఎస్టి, బిసి, మహిళా రిజర్వేషన్లు కాల రాసే విధంగా ఉన్న ఉద్యోగాలు ఊడ గొట్టినందుకా, బీఎస్‌ఎన్‌లో 50 వేలు ఉద్యోగాల ఊడి గొట్టినందుకా..? అతి పెద్ద రైల్వేను, ఎల్‌ఐసీ సంస్థ్ధలను ప్రైవేటు పరం చేయాలని యత్నిస్తునందుకా..? అని మంత్రి ప్రశ్నించారు. పట్టభధ్రులంతా ఏకతాటిపై నిలిచి టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి వాణి దేవిని భారీ మెజారిటితో గెలిపించాలని మంత్రి హరీష్‌రావు కోరారు. ఈ సమావేశంలో రాజ్య సభ సభ్యులు కేశవరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తదితరులు మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్‌నగర్ జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధిని సురభి వాణి దేవిని భారీ మెజారిటితో గెలిపించి సిఎం కెసిఆర్ సార్‌కు గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి

మహేందర్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌రావు,

కార్పొరేటర్లు వై. ప్రేమ్‌కుమార్, మేకల సునిత రాముయాదవ్, కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, జితేంద్రనాథ్, సబిత కిషోర్, మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీష్‌గౌడ్, సీనియర్ నాయకులు వీకె మహేష్, పరుశురాంరెడ్డి, రావుల అంజయ్య, సర్కిల్ అధ్యక్ష, కార్యదర్శులు పిట్ల శ్రీనివాస్, జీఎన్‌వీ సతీష్‌కుమార్, గుండా నిరంజన్, మోహన్‌రెడ్డి, ఖలీల్, లక్ష్మీకాంత్‌రెడ్డి, సంతోష్ రాందాస్, అమీనుద్ధీన్,మోహన్‌యాదవ్, భాగ్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News