Friday, March 29, 2024

ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao reacted to death of the activist

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వల్పమెజరిటీతో విజయం చేజారినప్పటికీ టిఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు,ఓటమిలను సమానంగా తీసుకోవలని చెప్పారు. ఓటమి చెందినప్పటికీ దుబ్బాక ప్రజలకు సేవలు, నియోజకవర్గం అభివృద్ధికోసం టిఆర్‌ఎస్‌శ్రేణులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటమికి ఆత్మ హత్యలు పరిష్కారం కావు, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని ఆయన చెప్పారు. దుబ్బాకలో టిఆర్‌ఎస్ ఓడిపోయినందుకు దౌల్తాబాద్ మండలం కొయినపల్లి గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ క్రార్యకర్త స్వామి అంత్యక్రియలు బుధవారం జరిగాయి.

ఈ కార్యక్రమాల్లో మంత్రి హరీష్‌రావు,ఎంపి కొత్తప్రభాకర్ రెడ్డి పాల్గొని స్వామి పాడె మోశారు. కార్యకర్తలందరూ సంయమనంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధైర్యంతో మరింత ముందకు పోవాలని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్ కార్యకర్త మరణవార్త విని ఎంతో బాధడ్డానని హరీష్‌రావు చెప్పారు.టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కాపాడుకుంటుంది. మేమందరం మీకు అండగా ఉంటామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజంగా ఉంటాయి, కానీ అనుకోని సంఘటన జరగినప్పుడు కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని చెప్పారు. స్వామి చాలా చురుకైన కార్యకర్త, దుబ్బాక ఎన్నికల్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో చురుగ్గాపాల్గొన్నారు. రాత్రింబవళ్లు పార్టీకోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. స్వామి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

స్వామికుటుంబానికి పార్టీ నుంచి రూ.2లక్షలు తక్షణ ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్‌లో స్వామి కుటుంబానికి టిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో తల్లికోరుకున్నట్లు చదివిస్తామని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌కు ఎంతో భవిష్యత్ ఉంది, ఎన్నో ఎన్నికల్లో గెలిచాము, కొన్నిసందర్భాల్లో ఓటమిని కూడా స్వీకరించాలని హరీశ్‌రావు అన్నారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు. స్వామికి సిఎం కెసిఆర్ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తున్నామన్నారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలమేరకే అందరం ఇక్కడికి వచ్చాము, సహాయం అందించామని ఆయన తెలిపారు. లోటుపాట్లు ఉంటే పార్టీ నాయకులు సరిచేస్తారు. కార్యకర్తలు ధైర్యంకోల్పోవద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News