Wednesday, April 24, 2024

బిజెపి పాలనలో రాష్ట్రానికి కోతలు.. వాతలే

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Comments On BJP

* బిజేపోళ్లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
* రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
* సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు కక్కుతున్న ప్రతిపక్షాలు
* ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలి
* సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి
* గ్లోబల్స్ ప్రచారాలను తిప్పికొట్టే బాధ్యత యువకులదే
* కరోనా కష్టకాలంలో అండగా నిలిచింది టీఆర్‌ఎస్ సర్కారే..
* నెనెక్కడున్న మనసు మాత్రం సిద్దిపేట వైపే ఉంటుంది
* సిద్దిపేట మున్సిపాలిటీలో అన్నీ సీట్లు టిఆర్‌ఎస్‌వే..

సిద్దిపేట: బిజెపి పాలనలో రాష్ట్రానికి కోతలు వాతలే తప్ప ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన పట్టణ యువజన, విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సిద్దిపేట అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్, బిజెపిలు అక్కసు వెల్లగక్కుతున్నారని అన్నారు. సిద్దిపేట అభివృద్ధిపై విమర్శలు చేసిన బిజెపోళ్లు ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. కొన్నిపార్టీల వారు రాజకీయ పబ్బం గడపడం కోసం దేవుళ్లు పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసి అన్యాయానికి గురి చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే సీఎం కేసీఆర్ కావడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఒకప్పుడు కరువు నేలగా ఉన్న తెలంగాణ నేడు పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలవుతుందన్నారు. మండు టెండలో సైతం గోదావరి పరవళ్లుతొక్కుతుందని దీంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. 70 ఏండ్లలో కాని అభివృద్ధిని ఏడేండ్లలో చేసి చూపించామన్నారు. ప్రజల సహకారం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సిద్దిపేట ఆన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో సిద్దిపేట పేరు తప్పనిసరిగా ఉంటుందన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సిద్దిపేటకు 26 జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులతో పాటు 9 రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. ఇది మన పనికి నిదర్శనమని అన్నారు. బీజేపోళ్లు చేస్తున్న గ్లోబల్స్‌ప్రచారాలను యువకులు తిప్పికొట్టాలన్నారు. మనం చేసిందే చెబుతూ.. ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 సీట్లు టీఆర్‌ఎసే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సైతం అందరికి అండగా నిలిచి శానిటైజర్లు, మాస్కులు నిత్యవసర సరుకులు పంపినీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు , నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, అత్తర్‌పటేల్, చిప్ప ప్రభాకర్, మెరుగు మహేశ్, పెర్క బాబు, ఐలయ్య, ఇర్షద్ హుస్సేన్, శ్రీనివాస్, నాగరాజు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News