Friday, April 19, 2024

పారదర్శకం.. డాక్టర్ల నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్యో నారాయణో హరి అని… తల్లిజన్మ ఇస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం కేవలం డాక్టర్లకే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. డబ్బుతో ఏదైనా కొనగ లం అని కొందరు అంటుంటారని, డబ్బుతో వస్తువులు కొనగలం కానీ, ప్రాణాన్ని మాత్రం కొనలేరని అన్నారు. అంతటి విలువైన ప్రాణాన్ని కాపాడే అవకాశం వైద్యులకు మాత్రమే ఉం టుందని చెప్పారు. నూతన ప్రభుత్వ వైద్యులు గ్రామీణులకు, పేదలకు మంచి వైద్యం అం దించి గొప్ప డాక్టర్లుగా పేరు పొందాలని ఆ కాంక్షించారు. వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 929 సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు శనివారం శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డిపిహెచ్ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి,టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, రా ష్ట్రంలో వైద్యుల నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి పైరవీలు లేకుండా జరిగిందని అన్నా రు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తూ, వాటి ని పరిష్కరిస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా కేవలం ఆరు నెలల్లోనే మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందని తెలిపారు. పేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకువచ్చిన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపుతూ, ప్రభుత్వ వైద్యులుగా కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగంలోకి ప్రవేశిస్తున్న వైద్యులకు స్వాగతం పలికారు. సమాజానికి, పేదలకు సేవ చేసేందుకు ముందుకొచ్చేలా, ఇంత మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దిన వైద్యుల తల్లిదండ్రులకు, గురువులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. వీలైతే కొత్త వైద్యులు వెంటనే ఉద్యోగాల్లో చేరాలని, కొత్త సంవత్సరం మొదటి రోజే చేరిన జ్ఞాపకంగా ఉంటుందని, ఆయా గ్రామాల ప్రజలు సంతోషిస్తారని పేర్కొన్నారు.
డాక్టర్లు పైరవీలకు రావొద్దు
కొవిడ్ సమయంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన డాక్టర్లకు రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌లో వెయిటేజీ కల్పించామని మంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసినవారు, కరోనా సమయంలో పనిచేసినవారు చాలా మంది ఇప్పుడు ప్రభుత్వ వైద్యులుగా మారారని అన్నా రు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసిన డాక్టర్లకు పిజిలలో కూడా వెయిటేజీ కల్పించామని చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పిజి డాక్టర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, పీజీ పూర్తి చేసినవారిని వెంటనే టివివిపి,డిఎంఇ పరిధిలోకి తీసుకుంటున్నామని తెలిపారు. వైద్యులు నిత్య విద్యార్థులుగా ఉండాలని, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాలని అన్నారు. బాగా పనిచేసి, మంచి ఫలితాలు తీసుకొచ్చే డాక్టర్లకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

దయచేసి వైద్యు లు బదిలీల కోసం, పైరవీల కోసం రావొద్దని, కనీసం రెండు మూడేళ్లు పోస్టింగ్ ఇచ్చిన చోటే పనిచేయాలని కోరారు. పేదలకు సేవ చేసేందుకే వైద్యులకు ఈ ఉద్యోగం వచ్చిందని అన్నారు. మంత్రిగా తన పదవి లక్ష్యం కూడా అదే అని, బాధ్యతలు వేరైనా… ఈ శాఖలోని అధికారులందరి లక్ష్యం ప్రజలకు సేవ చేయడ మే అని స్పష్టం చేశారు. డాక్టర్ సమయపాలన పాటిస్తే పేషంట్లు కచ్చితంగా వస్తారని, పేషెంట్లకు మంచి పలకరింపు, ఆత్మీయత సగం రోగాన్ని దూరం చేస్తుందని చెప్పారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరించుకుందాం.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు.
పిహెచ్‌సిలలోనూ ఆరోగ్య శ్రీ సేవలు
రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను ప్రభుత్వం పిహెచ్‌సిలకు విస్తరించిందని హరీశ్‌రావు వెల్లడించారు. డాక్టర్లకు ప్రోత్సాహకంగా ఉండేలా, ఇంకా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో దీనిని అమలు చేస్తున్నామన్నారు. పిహెచ్‌సిలలో పనిచేసే వైద్యులకు జీతంతోపాటు ఇన్సెంటివ్ అందుతుందని చెప్పారు.
ఆరు నెలల్లో 10,283 నియామకాలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 21,202 అని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 6,431 డాక్టర్లు, 7, 654 స్టాఫ్ నర్సులు, 5,192 పారా మెడికల్ సిబ్బంది, 1,927 ఇతర సిబ్బందిని నియమించామని తెలిపారు. వైద్యారోగ్య శాఖలో ఒక్క ఖాళీ కూడా ఉండొద్దు… మందుల కొరత ఉండొద్దు, ప్రజలకు నాణ్యమైన వై ద్యం అందాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొదటి దశలో 1.47 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసుకున్నామని అన్నా రు. ఈ దశలో 81 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సిఎం నిర్ణయం తీసుకున్నారని,ఇందులో తొలి ఫలితం గా 929 మందికి నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం. మరో మూడు నెలల్లో ఈ నియామకాలు పూర్తవుతాయని, 5,204 స్టాఫ్ నర్సుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, దానిని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే 24 ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, 1,785 ఎఎన్‌ఎం, 1,982 ఇతర సిబ్బంది కలిపి వైద్యారోగ్య శాఖలో మొత్తంగా 10,283 ఉద్యోగ నియామకాలను రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాధాన్యం
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఏర్పడిన తెలంగాణలో సిఎం కెసిఆర్ ఈ మూడింటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి తెలిపారు. తెలంగాణ వస్తే ఏమొచ్చించి అని అడిగితే.. ఇలా మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని ఉద్యోగాలు పొందిన తల్లిదండ్రులు చెప్పుకోవచ్చని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రకటించిన 80 వేల ఉద్యోగాల్లో మొదటి ఉద్యోగాలు పొందింది డాక్టర్లే అని పేర్కొన్నారు. నీళ్ల విషయంలో చూస్తే.. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేశామని చెప్పారు.

దీంతో ఎక్కడ చూసినా సమృద్ధిగా నీళ్లు కనిపిస్తున్నాయని, ఫలితంగా బంగారం వంటి పంటలు పండి దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిపోయిందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాలు మన ధాన్యాన్ని కొంటున్నాయని పేర్కొన్నారు. మన రాష్ట్ర అవసరాలు తీరగా, పక్క రాష్ట్రాల ఆకలి తీర్చగలగడానికి కృష్ణా, గోదావరి నీళ్ల ను మలుపుకోగలగడమే ప్రధాన కారణమని అన్నారు. మరోవైపు మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను తీర్చామని తెలిపారు. సిఎం కెసిఆర్ సంపదను పెంచి, పేదలకు పంచారని అన్నారు. నిధులు వచ్చాయి కాబట్టే ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని తెలిపారు.
తలసరి ఎంబిబిఎస్ సీట్లలో నెం.1గా ఉన్నాం
తెలంగాణ ఇప్పుడు తలసరి ఎంబిబిఎస్ సీట్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి లక్ష మంది జనాభాకు తెలంగాణలో 19 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయని, మన తర్వాతి స్థానంలో కర్ణాటక (17), తమిళనాడు (15), గుజరాత్ (10), మహారాష్ట్ర (9) ఉన్నాయని అన్నారు. డబుల్ ఇంజిన్ రాష్ట్రంలో లక్ష జనాభాకు 9 మంది డాక్టర్లు తయారయితే.. తెలంగాణలో 19 మంది తయారవుతున్నారని చెప్పారు.
తలసరి పిజి సీట్లలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రతి లక్ష జనాభాకు 2.77 మంది పిజి డాక్టర్లు ఉన్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 17కు చేర్చగలిగామని తెలిపారు. ఎంబిబిఎస్ సీట్లను 6,615 సీట్లకు పెంచామని, వచ్చే రెండేళ్లలో ఏడాదికి 8 చొప్పున మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు వస్తాయని, దీంతో వైద్య సదుపాయాలు పెరగడంతోపాటు ఎక్కువ సంఖ్యలో ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

మెడికల్ సర్వీసెస్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని, దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని పేర్కొన్నారు. మాతృమరణాల రేటులో ఇటీవలే మన రాష్ట్ర తమిళనాడును అధిగమించిందని, తెలంగాణ ఏర్పడేనాటికి మాతృమరణాలు 92 ఉంటే.. దానిని 43కు తగ్గించామని తెలిపారు. దీనిని ఇంకా తగ్గిస్తూ దేశంలో ప్రథమ స్థానానికి వచ్చేలా కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News