Friday, April 19, 2024

నారాయణఖేడ్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao visit Narayankhed

సంగారెడ్డి: వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రి మంగళవారం నారాయణ ఖేడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ హయాంలో కొనుగోళ్లు కేంద్రాలెన్ని, టిఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్ని? సంగారెడ్డి జిల్లాలో 70 శాతం పంట కొనుగోలు పూర్తి చేశాం. ఇంకా 30 శాతం కొనుగోలు చేయాల్సి ఉంది ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 157 కొనుగోలు కేంద్రలు ప్రారంభించాం. బిజెపికి, కాంగ్రెస్ కు కొనుగోలుపై మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలే పీయూష్ గోయల్‌దో వైఖరి ఒకలా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు మరోలా ఉంటున్నాయి. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం ఒక లెటర్ ఇవ్వాలి.

Minister Harish Rao visit Narayankhed

కేంద్రం తీరుతో తడిసిన వడ్లు కొనలేక పోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడన్నారు. నారాయణఖేడ్‌కు తాగు, సాగు నీటి ఇవ్వాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. 70 ఏళ్ళు అధికారం ఉన్న కాంగ్రెస్ త్రాగునీరు సాగు నీరు అందిచలేదు. రైతు బంధు కింద నారాయణఖేడ్ కు 200 కోట్లు టిఆర్ ఎస్ ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వలు కాంగ్రెస్, బిజెపివి. సింగూర్ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ పెట్టి సంగారెడ్డి జిల్లా కు నీరు అందిస్తామన్నారు. 4 వేల నాలుగు వందల కోట్లతో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని త్వరలో సిఎం కెసిఆర్ చేతుల మీద గా పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News