Friday, April 19, 2024

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్ టెలీ కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

Minister Harish teleconference on grain procurement

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి, అద‌న‌పు క‌లెక్ట‌ర్ ముజ‌మ్మీల్ ఖాన్‌తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలు తర్వాత రైతులకు డబ్బులు చెల్లించేందుకు సిఎం కెసిఆర్ రూ.26వేల కోట్ల సిద్ధంగా ఉంచారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాలో నగదు చెల్లింపులు చేయాలని సిఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి ఆలస్యం జరిగినా కొనుగోలు కేంద్రం ఇంఛార్జ్ అధికారిదే బాధ్యతన్నారు. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని చెప్పారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డ‌బ్బులు జ‌మ చేయాల‌ని ఆదేశించారు.

Minister Harish teleconference on grain procurement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News