Home సిద్దిపేట కుల వృత్తుల అభ్యున్నతే ధ్యేయం

కుల వృత్తుల అభ్యున్నతే ధ్యేయం

Minister HarishRao Speech About Padma Shali Devlopments

కుల వృత్తులకు దూరమైన వారికే సర్కారు చేయూతనిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వడ్డేపల్లి దయానంద్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పద్మశాలి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులతో ప్రమాణా స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ ఐదు శాతం మాత్రమే చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మిగిలిన 95 శాతం వేరే కుల వృత్తులను స్వీకరిం చి అభివృద్ధిలో వెనకబడి పోయారని, అలాంటి వారి కోసం రూ.1.50 లక్షలతో వర్కు షెడ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులు నేచిన వస్త్రాలను సుమారు రూ.600 కోట్లు వెచ్చించి ప్రభుత్వమే  కొంటుందని, చేనేత మిత్ర కింద నూలు రంగుల కోసం 50 శాతం సబ్సీడీ ఇస్తున్నామన్నారు. 1100 పవర్ ల్లూమ్ కార్మికుల కోసం సబ్సిడీ కింద విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు.  మెగా టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా గొల్లభామ చీరలకు పేరు తీసుకొస్తామన్నారు. బీసీలకు రూ.1000 కోట్లతో ఆవులు, గేదెలు ఇచ్చే నూతన పథకాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే నూతన పద్మశాలి భవనానికి కావల్సిన భూమిని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చించి ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసి ప్రతి వారు చదువుకునేలా కృషి చేస్తామన్నారు. గతంలో బడ్జెట్‌లో రూ.1200 కోట్ల నిధులను పద్మశాలిల కోసం కేటాయించామన్నారు. 561 మంది బ్యాంకులో తీసుకున్న రుణాలను మాఫీ చేయించామన్నారు. సిద్దిపేటలో నిర్మిస్తున్న పద్మశాలి భవనానికి గతంలో కోటి రూపాయలు మంజూరు చేశామని, అలాగే మరో రూ.50 లక్షలను కూడా అందజేస్తామన్నారు. గజ్వేల్‌లో భవన నిర్మాణానికి కోటి రూపాయలు, దుబ్బాక, హుస్నాబాద్‌లో భవన నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. రూ.4 వేల కోట్లతో కొత్త పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సెన్, చాగన్ల నరేంద్రనాథ్, డాక్డర్ సతీష్, బూర విజయ మల్లేశం, వాణి తదితరులు పాల్గొన్నారు.