Home తాజా వార్తలు హరిత తెలంగాణే కెసిఆర్ లక్ష్యం

హరిత తెలంగాణే కెసిఆర్ లక్ష్యం

Indra-karan-Reddy

మన తెలంగాణ/హైదరాబాద్ : హరిత తెలంగాణే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు లక్షమని రాష్ట్ర అట వీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అందు లో భాగంగానే తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నా రు. మన రాష్ట్రంలో సాగుతున్న హరితహారం కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని పెద్దఎత్తన మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. చెట్లు మానవాళికి ఆధారమని, చెట్లు లేనిదే మానవ మనుగుడ లేదని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ హరితవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో సాహస క్రీడలను(అడ్వేంచర్ స్పోర్ట్స్) ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడు తూ మొక్కలను సమృద్ధిగా పెంచి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామన్నారు. అడవుల వలన వర్షాలు సకాలంలో కురుస్తాయన్నారు. చెట్లు మానవాళికి ఉపయోగపడే ప్రాణవాయువును ఇచ్చి, మనకు హాని కలిగించే, గాలిలోని కార్బన్ డై ఆకె్సైడ్ వాయువును పీల్చుకుంటాయని తెలిపారు.

పర్యావరణ సమతుల్యత ఎంతో ముఖ్యమని, ఇది దెబ్బతినడం మూలంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అన్నారు. భూభాగుంలో 33శాతం మేర అడవులు, చెట్లు ఉండాలన్నా రు. కానీ మన రాష్ట్రంలో 24 శాతం మేర మాత్రమే ఉన్న ట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే హరితహారం కార్యక్రమం కింద పెద్దఎత్తున మొక్కలు నాడుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణకు హరితహారం ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్ర మం చేపడుతున్నట్టు తెలిపారు. పచ్చని చెట్లు ప్రగుతికి మెట్లు అని, ప్రతి ఒక్కరూ ఉద్యమంలా చెట్లను నాటి సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మేర కాపాడబడలేకపోతే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవన్నారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్ర మం మాత్రమే కాదని, ఇది ప్రతి ఒక్కరి కార్యక్రమమన్నారు.

ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అర్బన్ ఫారె స్ట్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పచ్చని చెట్లు, బోటింగ్, జంతువులతో ఇప్పటికే సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న మావల హరితవనంలో నేటి నుంచి సాహసక్రీడలు సైతం అందుబాటులోకి వచ్చాయన్నారు. పార్కులో సె్కై సైక్లింగ్, జిప్పింగ్, రోప్ కోర్సులను ఏర్పాటు చేశామనన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Minister Indra karan Reddy Comments On Haritha Haram