Home Default దేవాదాయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు : ఇంద్రకరణ్ రెడ్డి

దేవాదాయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు : ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddyహైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. ఈ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అధికారులతో శుక్రవారం సమీక్ష చేశారు. దేవాదాయ శాఖ భూముల లీజ్ రెంట్లు, భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న‌, ఆల‌య భూముల వేలం ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, త‌దిత‌ర అంశాల‌పై ఆయన అధికారుల‌తో చ‌ర్చించారు. దేవాదాయ శాఖ భూముల విషయంలో అధికారులు అలసత్వం వీడాలని ఆయన సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో  దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు పాల్గొన్నారు.

Minister Indrakaran Reddy Review On Endowment Lands