Home తాజా వార్తలు నిర్మల్ లో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

నిర్మల్ లో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

 

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డ్ లో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. సిఎం కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Minister Indrakaran starts membership drive in Nirmal