Tuesday, May 30, 2023

మహిళలు ఆ దాడులను తిప్పికొట్టారు… గ్రేట్: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Jagadeesh Reddy comments on BJP leaders

సూర్యాపేట: తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అనేది బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ సమాధానం చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.  బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రెండో రోజు పర్యటనలో భాగంగా గుండాలతో బిజెపి నేతలు రైతులపై పాశవికంగా జరిపిన దాడిని  జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. యాసంగిలో తెలంగాణా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అని నిలదీసినందుకే మహిళలు, గిరిజనులు, దళితులు అన్న తేడా తెలియకుండా  ఇంతటి గుండాయిజానికి బిజెపి పాల్పడిందని ఆయన ఆరోపించారు. భూస్వామ్య దాడులను మరిపించే పద్దతిలో బండి సంజయ్ వెంట వచ్చిన గుండాలు జరిపిన దాడులను తిప్పికోట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట చైతన్యాన్ని మరోమారు చాటిన మహిళా రైతాంగాన్ని ఆయన అభినందించారు. ఇంతకూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అని చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News