Friday, April 19, 2024

మోడీకి వణుకు పుట్టిస్తున్న సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -

Minister jagadish reddy fires on PM Modi

చండూర్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాని మోఢీలో వణుకు పుట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వంపై కమలనాధులు కక్ష కట్టి మరీ దాడులకు పునుకుంటున్నరని దుయ్యబట్టారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో బుధవారం జరిగిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చెందిన కుటుంబసభ్యులతో జరిగిన ఆత్మీయ సమ్మేలాననికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావి, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కార్పొరేషన్ చైర్మన్ లు రామచంద్ర నాయక్, శ్రీధర్ రెడ్డి లతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…. రైతు బంధు,రైతు భీమా పధకాలు బిజెపి పాలకులను బెంబేలెత్తిస్తున్నాయన్నారు. వ్యవసాయానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అందిస్తున్న 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ తో పాటు తెలంగాణలో నిరంతరం సరఫరా అవుతున్న 24 గంటల విద్యుత్ ప్రధాని మోడీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో రైతు బంధు,రైతు బీ మా లతో పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్,24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా లపై బిజెపి పాలిత రాష్ట్రాలలో తిరుగుబాటు సంభవిస్తుందేమోనన్న భయం బిజెపి ని వెంటాడుతోందని ఆయన చెప్పారు.

ప్రధాని మోఢీ సొంత రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతి,సంక్షేమ పథకాలపై అక్కడి ప్రజల నిలదీతలు మొదలయ్యాయన్నారు. అందుకే కమల నాధులు కక్ష కట్టి మరీ తెలంగాణ రాష్ట్రంపై దాడులకు పునుకుంటున్నారని విమర్శించారు. అటువంటి వారి దాడులను గులాబీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి టిఆర్ఎస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా స్పందిస్తే ఢిల్లీ భాష లది ఇక్కడ పని చేయదని, గుజరాత్ బాస్ లకు గులాంగిరి చేస్తున్న వారిని నిరోదించ గలుగుతామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ కబలిస్తే ఆ ఫ్లోరోసిస్ ను మటు మాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం సిఎం కెసిఆర్కే చెల్లిందన్నారు. స్వీయ నియంత్రణతో టైం బౌండ్ ప్రోగ్రాం మరీ పెట్టుకుని మిషన్ భగీరథ తో ఫ్లోరోసిస్ ను శాశ్వతంగా నిర్ములించడమే కాకుండా ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గణతి కెక్కిందన్నారు. కళ్యాణలక్ష్మి పధకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వానికి అద్దం పడుతుండగా ఎన్నికల్లో చెప్పని పధకాలు, ఇవ్వని హామీలు కుడా అధికారంలోకి వచ్చాక అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రికి మాత్రమే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News