Home తాజా వార్తలు గ్రామ స్వరాజ్యమే లక్ష్యం : జూపల్లి

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం : జూపల్లి

Jupally, Minister Jupally Comments on New Panchayati Raj Act

హైదరాబాద్ : మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్రామ స్వరాజ్యం ఏర్పాటు కోసం కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో గురువారం కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి మాట్లాడారు. 25 ఏళ్ల క్రితం రూపొందించిన పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశామని ఆయన పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టిఎస్‌ఐపాస్ వంటి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని పక్కాగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. సర్పంచులకు, పాలకవర్గాలకు పూర్తి అధికారాలు ఇచ్చామని, గ్రామాలకు నిధులను కూడా పెంచామని ఆయన పేర్కొన్నారు.

Minister Jupally Comments on New Panchayati Raj Act