Home తాజా వార్తలు కేంద్ర మంత్రి గెహ్లాట్ ను కలిసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

కేంద్ర మంత్రి గెహ్లాట్ ను కలిసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister-Koppula-Eshwar

 

హైదరాబాద్: కేంద్రమంత్రి తహర్ చంద్ గెహ్లాట్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపి నామా నాగేశ్వర్ రావు సోమవారం కలిశారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఎస్సిల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 238 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు సమర్థవంతంగా నడుస్తున్నాయన్నారు. సోషల్ వెల్ఫేర్ లో ఒకటవ తరగతి నుంచి ఐదోవ తరగతి వరకు 66 మినీ గురుకులాల కోసం రూ. 303 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం రూ. 356 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాని కోరినట్టు మంత్రి వెల్లడించారు.

బిజెఆర్సీవై ప్రతిపాదించిన 7 హాస్టళ్ల కొరకు రూ.21 కోట్లు ప్రత్యేక కేంద్ర సహాయం కింద రూ. 201 కోట్లు సహాయం అందించాలని, ఎస్సి కార్పొరేషన్ ద్వారా యువత శిక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని వాటికి కోసం రూ.50 కోట్లు, ఎడిఐపి పథకం కింద దివ్యాంగులకు వీల్ చైర్లు అందించేందుకు రూ. 22 కోట్లు సహాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్టు మంత్రి కొప్పుల పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గెహ్లాట్ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తామని హామీ ఇచ్చారు.

Minister Koppula Eshwar meets Thawar Chand Gehlot