Home తాజా వార్తలు టిఆర్ఎస్ నే గెలిపించాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

టిఆర్ఎస్ నే గెలిపించాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Koppula Ishwar Election Campaign In Jammikuntaకరీంనగర్ : అన్ని మతాలను, అన్ని కులాలను సమాన గౌరవంతో చూసే టిఆర్ఎస్ కే ఓటేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను కోరారు. మతతత్వ పార్టీ అయిన బిజెపికి ఓటేయడం వల్ల ఎటువంటి మేలు జరగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో మతసామరస్యం పరిఢవిల్లుతుందని ఈశ్వర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు ఓటేసి , గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.  ఆదివారం మంత్రి ఈశ్వర్ జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, గెల్లును గెలిపిస్తేనే హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈశ్వర్ స్పష్టం చేశారు.   మంత్రితో పాటు  జమ్మికుంట  మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు మల్లయ్య, శ్రీనివాస్, టిఆర్‌ఎస్ అర్బన్‌శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, పాస్టర్లు ఆనందయ్య, అశోక్‌ తదితరులు ఉన్నారు.