Home తాజా వార్తలు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం: కెటిఆర్

ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం: కెటిఆర్

Minister KTR addressing Public Transport in Hyderabad

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌తో పాటు గచ్చిబౌలి-హాఫీజ్‌పేట్ మార్గంలో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌కు మంత్రి కెటిఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. పెద్ద ఎత్తున్న జరుగుతున్న పట్టణీకరణ, జనసాంద్రత పెరుగుదలతో ప్రస్తుతం భాగ్యనగరంలో ప్రజా రవాణా ఆశించిన స్థాయిలో లేదన్నారు. ముంబయి లాంటి మహా నగరాల్లో 70 శాతం మంది ప్రజా రవాణాను వినియోగిస్తుంటే.. హైదరాబాద్‌లో ప్రజా రవాణా కేవలం 34 శాతం మాత్రమేనని కెటిఆర్ పేర్కొన్నారు. నగరంలో రూ. 23 వేల కోట్లతో 54 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రవాణా పెరిగే కొద్ది కాలుష్యం కూడా పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కెటిఆర్ వివరించారు. అలాగే అమీర్‌పేట-ఎల్‌బినగర్ మెట్రో మార్గాన్ని ఆగస్టులోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక అమీర్‌పేట-హైటెక్ సిటీ మెట్రో మార్గాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభిస్తామన్నారు.