Friday, March 29, 2024

ఇక నో ట్రాఫికర్

- Advertisement -
- Advertisement -

ఒక్క ఎల్‌బి నగర్‌లోనే మూడు పెద్ద ఫ్లైఓవర్‌లు నిర్మించాం

ట్రాఫిక్ సమస్య లేకుండా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కింది
బైరామల్‌గూడ పైవంతెన ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

Minister KTR Begins Bairamal Guda Flyover

మన తెలంగాణ/హస్తినాపురం: హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజల రాకపోకలకు ఏమాత్రం అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. బైరామల్‌గూడ సర్కిల్ వద్ద సాగర్ హైవే మార్గమధ్యలో ఎస్‌ఆర్‌డిపి పథకంలో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిని సోమవారం కెటిఆర్, విద్యాశాఖ మంత్రి స బితా ఇంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌బినగర్‌లో ఇటీవల మూడు పెద్దస్థాయి ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు ఆయా స్థాయి ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వారి సూచనలు, సలహాలు పాటిస్తూ అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

అనంతరం కెటిఆర్, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ, వనస్థలిపురం కార్పొరేటర్లు రమావత్ పద్మానాయక్, రమణారెడ్డి, శ్రీనివాస్‌రావు, రాజశేఖర్‌రెడ్డిలతో, ఎస్‌ఆర్‌డిపి చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ఎస్‌ఇ రవీందర్‌రాజు, ఇఇ రోహిణి, జిహెచ్‌ఎంసి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి, డిసిలు విజయకృష్ణ, హరికృష్ణ, ఎస్‌ఇ శంకర్‌లాల్, డిఇఇ కార్తిక్ పోలీసు అధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరో వన్ వే నిర్మాణం పనులు కూడా కొనసాగిస్తున్న ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి స్థానిక కార్పొరేటర్ల సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు.

Minister KTR Begins Bairamal Guda Flyover

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News