Home తాజా వార్తలు వ్యవసాయాన్ని పండుగలా మార్చాం …

వ్యవసాయాన్ని పండుగలా మార్చాం …

KTR-5

రాజన్నసిరిసిల్ల : తెలంగాణ సిఎం కెసిఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని మంత్రి కెటిఆర్ తెలిపారు. సర్దార్‌పూర్‌లో పాలిటెక్నిక్ కళాశాల, వసతిగృహాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఎపిలో కరెంట్ లేక రైతులు అల్లాడారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం కరెంట్ కోతలు లేకుండా చూస్తున్నామని చెప్పారు. రైతులకు రుణ మాఫీ చేశామని, వచ్చే ఏడాది నుంచి ప్రతి రైతుకు ఎనిమిది వేల పెట్టుబడి ఇస్తామన్నారు. వ్యవసాయ రుణ మాఫీపై తెలంగాణలో పంజాబ్ ప్రభుత్వం అధ్యయనం చేసిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Minister KTR Comments on Agriculture