హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిందని మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ సుపరిపాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో సాగుతుందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ మరోమారు ఎన్నిక కావడంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు ఆయన శుభాభివందనలు తెలిపారు. టిఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా కవితలను కెటిఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ గళం.. బలం.. అగ్రగామి దళం.. టిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి 20 ఏండ్ల పండుగ అంటూ కేటీఆర్ తెలిపారు.
ఈ మట్టి కోసమే పుట్టి
గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి
20 ఏండ్ల పండుగ!స్వీయ రాజకీయ అస్తిత్వ
పతాకానికి
దిగ్విజయ ద్విదశాబ్ది వేడుక!తెలంగాణ గళం ..బలం.. అగ్రగామి దళం
TRS!జలదృశ్యం నుండి
సుజల సుఫల దృశ్యాల దాకా
ప్రపంచం చూడని.. మహోన్నత
పరివర్తనా ప్రస్థానం!#20YearsOfTRS pic.twitter.com/gAZUPpnd7j— KTR (@KTRTRS) October 25, 2021