Wednesday, April 24, 2024

గోరటి వెంకన్నకు కెటిఆర్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Minister KTR congratulates Goreti Venkanna

హైదరాబాద్: ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్నకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోరటి వెంకన్నతో పాటు మరో ఇద్దరు తెలంగాణ సాహిత్యకారులైన దేవరాజు మహారాజు, తగుళ్ళ గోపాల్‌లకు సాహిత్య అకాడమీ దక్కిన నేపథ్యంలో వారికి సైతం మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఒకేసారి వివిధ కేటగిరిలలో మూడు సాహిత్య అకాడమీ అవార్డులు దక్కడం అంటే తెలంగాణ భాషకు, సాహిత్యానికి జాతీయ స్థాయిలో దక్కిన గుర్తింపుగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News