Friday, April 19, 2024

ఇదెక్కడి న్యాయం?

- Advertisement -
- Advertisement -

Minister KTR fires on JP Nadda

మసీదులు తవ్వాలన్న బండి సంజయ్‌పై చర్యలేవి?

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో
విధానం.. హోదాలను
బట్టి చర్యలుంటాయా?
జాతీయ పార్టీకి
ఉండాల్సిన లక్షణమేనా
ఇది? బిజెపిపై ట్విట్టర్
వేదికగా కెటిఆర్
ప్రశ్నల వర్షం
నుపుర్ ఢిల్లీ
మీడియా విభాగం
నేత నవీన్ జిందాల్‌పై
చర్యలను ప్రస్తావించిన
మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి అధిష్టానంపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసాని తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు.. సంధించారు. ఆ పార్టీ తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలను ఊటంకిస్తూ ఎద్దేవా చేశారు. పార్టీలో నాయకులపై చర్యలు వారి స్థాయి, బట్టి ఉం టాయా? అని విమర్శించారు. లేక రాష్ట్రాలను బట్టి ఉంటాయా? అనే విషయంపై స్పష్టత లేదన్నారు. ఈ చర్యలు ఆ పార్టీలో సమన్యాయం అమలు జరగడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా ఒకే రకంగా ఉండాలన్నారు. కానీ బిజెపిలో అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల పరిగణలోకి తీసుకుని నాయకులపై చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నా రు. ఒక జాతీయ పార్టీకి ఉండాల్సిన లక్షణమేనా ఇది? అని నిలదీశారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని బిజెపి అవలంభిస్తోందని మండిపడ్డారు. నిజంగానే అన్ని మతాలను స మానంగా గౌరవించే సంప్రదాయం ఉంటే మసీదులను త వ్వి ఉర్దూపై నిషేధం విధించాలని బహిరంగ ప్రకటన చేసిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎందుకు చర్య తీసుకోలేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా బిజెపి అధిష్టానానిది అంతా డబుల్ గేమ్‌గా కనిపిస్తోందన్నారు.

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అల్లర్లకు కారణమవుతున్నారనే కారణంగా ఢిల్లీ మీడియా విభాగం నేత నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించగా, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేశంలో ఏ ఒక్క వర్గం లేదా మతాన్ని అవమానించే భావజాలానికి తాము పూర్తిగా వ్యతిరేకమని ఆ పార్టీ స్పష్టం చేసింది. అలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులను లేదా అభిప్రాయాలు కలిగిన వారిని తమ పార్టీ ప్రోత్సహించదని పేర్కొన్న బిజెపి మరి బండి సంజయ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా బండి సంజయ్ పలుమార్లు వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

ఇటీవల మసీదులను తవ్వాలని ప్రకటన చేసినప్పుడు బిజెపి అధిష్టానవర్గానికి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎందుకు అనిపించ లేదని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ఇది ముస్లిం ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కాదా? అని ప్రశ్నించారు. పైగా బండి సంజయ్ పాతబస్తీలో పర్యటించిన పలు సందర్భాల్లో ముస్లిం ప్రజల హృదయాలను గాయపరిచే విధంగా మాట్లాడారన్నారు. ఇవన్నీ బిజెపి పెద్దలకు తెలియవా? అని కెటిఆర్ అడిగారు. లేక ఢిల్లీలో ఒక విధానం….తెలంగాణ రాష్ట్రంలో ఒక విధానాన్ని అవలంభిస్తోందా? అన్న విషయాన్ని ఆ పార్టీ పెద్దలు స్పష్టం చేయాల్సిన అవసరముందని ట్విట్టర్‌లో కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ అన్ని మతాలను సమానభావంతో చూస్తోందని చెప్పదలుచుకుంటే వెంటనే బండిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News