Friday, April 19, 2024

ఘనంగా ప్లీనరీ

- Advertisement -
- Advertisement -

Minister KTR Holds Meeting on Vijaya Garjana

ఈ నెల 25న హెచ్‌ఐసిసిలో జరిగే టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలి వచ్చే నెల 15న వరంగల్‌లో జరగనున్న విజయగర్జన దశదిశలా మార్మోగేలా జరిపించాలి : తెలంగాణ భవన్‌లో 20 నియోజకవర్గాల పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్: ఈ నెల 25న జరిగే హైటెక్స్‌లో జరిగే ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఏళ్ల ఉత్సవాల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతి నిధులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు దిశానిర్దేశం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో 20 నియోజకవర్గాల ప్రజాప్రతిని ధులను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడారు. సిఎం కెసిఆర్ నిర్వహించిన ఉమ్మడి సమావేశం ముగిసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు కెటిఆర్ పలువురు నేతలతో సమావేశమ య్యారు. ఈ నెల 25న హెచ్‌ఐసీసీలో నిర్వ హించనున్న ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో పలు అంశాలపై చర్చించారు.

సిరిసిల్ల, కోరుట్ల, దుబ్బాక, సంగారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూర్, చేవెళ్ల, సూర్యాపేట్, హుజుర్‌నగర్, దేవరకొండ, తుంగతుర్తి, వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, అలంపూర్, కామారెడ్డి, బాన్స్‌వా డ, జుక్కల్, ఎల్లారెడ్డి, నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీకి పార్టీ తరఫున హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానం అందుతుందని, నవంబర్ 15న జరిగే వరంగల్ లోని తెలంగాణ విజయగర్జన సభకు ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. ప్లీనరీ,బహిరంగసభ కార్యాచరణకు గ్రామ,మండల స్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించాలని, ఈ నెల 27న జరిగే నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలులోగా ఈ సమావేశాలను పూర్తి చేయాలన్నారు.

బహిరంగసభ కి ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యచరణ ఉండాలన్నారు.పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలో చేస్తారని, విజయగర్జన తర్వాత పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. మంత్రి కె. తారక రామారావుతో పాటు సమావేశంలో పాల్గొన్న టిఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సబితారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మహేష్‌రెడ్డి, మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలవారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బండా ప్రకాశ్, మాలోతు కవిత తదితరులు కేటీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు.

హైటెక్స్‌లో ప్లీనరీకి ఏర్పాట్లు..

ఈనెల 25న జరగనున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సోమవారం కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంబీపూర్ రాజు, టిఎస్‌ఐఐసి చైర్మెన్ బాలమల్లు,స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి ముందస్తు చర్యల్లో భాగంగా ప్లీనరీ సమావేశానికి చెందిన ఏర్పాట్ల పనులను పరిశీలించారు. పలు ప్రాంతాల నుంచి సభకు రానున్న ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్‌తో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పార్కింగ్‌తో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News