Saturday, April 20, 2024

సిరిసిల్లలో షాదీఖానాను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: కులమతాలకు అతీతంగా సబ్బండ వర్గాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్లలో కోటి పది లక్షల రూపాయలతో నిర్మించిన ముస్లింల షాదీఖానాను మంత్రి కెటిఆర్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సిఎం కెసిఆర్ మతం పేరిట, కులం పేరిట ఏ నాడు రాజకీయం చేయలేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడ అమలు కావడం లేదన్నారు. పుట్టిన బిడ్డనుండి పండు ముదుసలి వరకు ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందుతున్నారన్నారు.కులమతాలకు అతీతంగా ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నామన్నారు.

తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి గురుకుల విద్యపై ఏటా 6 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. మైనార్టీల కోసం 204 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతివిద్యార్థిపై ఏటా 1.20 లక్షలు వ్యయం చేస్తున్నామన్నారు. ఓవర్సీస్ విద్యానిధిక్రింద విదేశాల్లోని 7 వేల మంది విద్యార్థులకు ఆర్థిక సహయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వమన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఎనిమిదిన్నరేళ్లుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల,వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల,జెఎన్‌టియు కళాశాల వంటివి అనేకం తీసుకువచ్చామన్నారు.

ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు కుల,మత,రాజకీయ,వర్గ బేధాలు ఏవి లేవన్నారు.అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా నిరాధారమైన ఆరోపణలు చేయకుండా తాము ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పి ప్రజల మనస్సు గెలుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు షాదీఖానాకు టెంట్ సామాగ్రి కోసం పది లక్షల రూపాయలు కావాలని కోరగా మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్‌పి సిపి అరుణ,ఎంసిపి కళ, కలెక్టర్ అనురాగ్ జయంతి ముస్లిం నాయకులు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News