Home తాజా వార్తలు మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించిన కెటిఆర్

మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించిన కెటిఆర్

Minister KTR

 

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం మండలం, మంగళ్‌పల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఇబ్రహీంపట్నం అభివృద్ధి దిశగా వెళుతుందని పేర్కొన్నారు.  పెద్దఅంబర్‌పేట జంక్షన్ నుంచి బాట సింగారం వరకు రూ. 1.82 కోట్లతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర స్ట్రీట్ లైట్ల ఏర్పాటు పనులను కూడా కెటిఆర్ ప్రారంభించారు. త్వరలోనే బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాాద్ ను విశ్వనగరంగా మార్చాలన్నది సిఎం కెసిఆర్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్క్‌తో 1000 మందికి ఉపాధి లభిస్తుందని, అందుకోసం మౌలిక వసతుల కల్పించి పారిశ్రామికాభివృద్ధిని పెంచడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

Minister KTR Inaugurates Mangalpally Logistics Park