Home తాజా వార్తలు స్పర్శ్‌ హాస్పిస్‌ కొత్త భవనాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

స్పర్శ్‌ హాస్పిస్‌ కొత్త భవనాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

Minister KTR inaugurates Sparsh Hospice New Buildingహైదరాబాద్‌: క్యాన్సర్‌ రోగుల కోసం ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని మంత్రి కెటిఆర్‌ శనివారం ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్‌ హాస్పిస్‌’ ఉచిత వైద్య సేవలు అందిస్తుండడంపై కెటిఆర్ అభినందించారు. రోటరీ క్లబ్‌ బంజారాహిల్స్‌ సారథ్యంలో  రోడ్‌ నం.12లోని అద్దె భవనంలో స్పర్శ్‌ హాస్పిస్‌ ప్రతినిధులు  సేవలు అందించారు. ప్రస్తుతం దీన్ని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనంలోకి  మార్చారు.  ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని నిర్మించారు. ఈ స్థలాన్ని 33 ఏండ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. చావు ముంగిట్లో ఉన్న  క్యాన్సర్‌ రోగులకు స్పర్శ్‌ హాస్పిస్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా 10 పడకలు ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రికి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో రోగులు వస్తున్నారు.