Thursday, April 25, 2024

9న కామారెడ్డి జిల్లాకు మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Kamareddy Tour on 9th November

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ ఈ నెల 9న కామారెడ్డి జిల్లాకు రానున్నారు. బిబిపేట మండల కేంద్రంలో ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మిస్తున్న పాఠశాలను మంత్రి ప్రారంభించనున్నారు. పాఠశాల పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధం కావడంతో ప్రారంభోత్సవానికి మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి రావడానికి మంత్రి సుముఖత వ్యక్తం చేయడంతో పాఠశాలతో పాటు బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో సుభాష్‌రెడ్డి నిర్మిస్తున్న మోడల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా అదే రోజు మంత్రితో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయిన అనంతరం కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బిఇడి కళాశాల సమీపంలో నియోజకవర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. అయితే మంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News