Home తాజా వార్తలు విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యం: కెటిఆర్

విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యం: కెటిఆర్

Minister KTR

 

హైదరాబాద్: డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ కార్యాలయంలో మంత్రి కెటిఆర్ సమావేశం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి నగర సెంట్రల్ విజిలెన్స్ సెల్, మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. భవన నిర్మాణ వ్యర్థాల పారవేత, చెత్త వేయడం, ఫుట్ పాత్ ల ఆక్రమణపై జరిమానాలను ఈ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్మహించే అవకాశం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. జిహెచ్ఎంసి విపత్తు నిర్వహణ దళంలోని ఉద్యోగుల ప్రమాద భీమా, ఆరోగ్య బీమా సౌకర్యాన్ని మంత్రులు ప్రారంభించారు. నగర్ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహణ విభాగాలు ఏర్పాటు చేస్తామని, ముందుగా స్మార్ట్ సిటిలైన్ వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఏర్పాట్లను అన్ని కార్పొరేషన్లకు దశల వారీగా విస్తరణ చేస్తామని కెటిఆర్ వెల్లడించారు. నగరాల్లో జరిగే అనుకోని ప్రమాదాలు, విపత్తులను సమర్థంగా ఎదుర్కొవడమే లక్ష్యంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహణ విభాగం బాగా పని చేస్తోందని ఆయన చెప్పారు. వరదలు, భారీ వర్షాలు, భవన నిర్మాణ ప్రమాదాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాలు సహాయకారిగా ఉంటాయన్నారు. ప్రతి నగరంలో విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటుపై చర్యలు తీసుకొవాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశం జారీ చేశారు.

Minister KTR launches of CVC Mobile App