Home తాజా వార్తలు పార్టీ బలోపేతం

పార్టీ బలోపేతం

Minister KTR meeting on trs membership registration

 

పార్టీ ఒక పిలుపు ఇస్తే రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు మారుమోగాలి
పార్టీ శ్రేణులంతా దానిని అందుకొని చురుగ్గా కదలాలి, టిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు సభ్యత్వ నమోదు ఘనంగా సాగుతున్న తీరే నిదర్శనం
ప్రజలు బాగా స్పందిస్తున్నందన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పొడిగించే విషయం సిఎం దృష్టికి తీసుకెళ్తా తెలంగాణభవన్‌లో సభ్యత్వ నమోదుపై జరిగిన సమావేశంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే విధంగా ప్రధాన కార్యదర్శలు దృష్టి సారించాలని టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షుడు కెటిఆర్ ఆదేశించారు. ఈ నెలఖరులోగా కమిటీల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ప్రధానంగా గ్రామ, మండల కమిటీలను పకడ్బందిగా వేయాలని సూచించారు. పార్టీ ఒక పిలుపునిస్తే రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి కమిటీల వరకు పార్టీ శ్రేణులంతా పనిచేసే విధంగా కమిటీలు ఉండాలని కెటిఆర్ పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో మం చి ఆదరణ ఉందని… ఇందుకు మన పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమో దు కార్యక్రమానికి వస్తున్న స్పందనకు నిదర్శమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎంఎల్‌సి ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో సభ్యత్వ నమోదును అవసరమైతే మరో నాలుగైదు రోజుల పాటు గడువు పెంచుతామన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో సాయంత్రం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సంబంధిత నాయకులతో కెటిఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లాల వారిగా ఎక్కెడక్కడ ఎంత జరిగింది? ఎన్ని నియోజకవర్గాల్లో లక్షం పూర్తి అయింది? లక్ష్యానికి మించి సభ్యత్వం జరుగుతున్న నియోజకవర్గాలు ఎన్ని? తదితర అంశాలపై ఆయన కూలంకషంగా చర్చించారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాల పరిధిలోని జిల్లాల్లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో అందరు పనిచేసి లక్ష్యానికి మంచి సభ్యత్వం చేయాలని సూచించారు. ఇప్పటికే సుమారు 70 లక్షల మేరకు సభ్యత్వం జరగడం పట్ల పార్టీ శ్రేణులపై ఆయన ప్రశంసలను కురిపించారు. ప్రతి నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ ఆదేశించిన నేపథ్యంలో దాదాపు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆ లక్ష్యం పూర్తవుతున్నదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సుమారు లక్ష సభ్యత్వం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నదన్నారు. చాలా నియోజకవర్గాల్లో 50 వేలకు మించి సభ్యత్వ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం నియోజకవర్గాల శాససనభ్యులు కెటిఆర్ ప్రత్యేకంగా ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సాధించిన శాసనసభ్యులను కూడా ఈ సందర్భంగా కెటిఆర్ అభినందించారు. కాగా సభ్యత్వ నమోదుకు సంబంధించిన రుసుము సైతం పార్టీ కార్యాలయానికి ఎప్పటికప్పుడు డిపాజిట్ చేస్తున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ సందర్భంగా కెటిఆర్‌కు వివరించారు. సభ్యత్వ నమోదుకు ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరో వారం, పది రోజుల పాటు పొడిగించాలని పలువురు శాసనసభ్యులు కోరిన విషయాన్ని కూడా వారు కెటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఈ అభ్యర్ధలను పార్టీ అధ్యక్షులు కెసిఆర్‌కు కూడా వివరిస్తామమని కెటిఆర్ హామి ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మరింత గడువుపై స్పష్టత ఇస్తామన్నారు. సభ్యత్వ నమోదుతో పాటు సమాంతరంగా డిజిటలైజేషన్ ఈ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే సుమారు 50 శాతం సభ్యత్వ వివరాలను కంప్యూటరీకరణ చేశామన్నారు. సభ్యత్వ నమోదు దాదాపుగా పూర్తయినందున వెంటనే కమిటీల ఏర్పాటుపై సాధ్యమైనంత త్వరగా దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శలకు కెటిఆర్ సూచించారు. మరో నెల రోజుల పాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు ఉన్నందున, క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పని చేయాలని ఆయన ఆదేశించారు.

Minister KTR meeting on trs membership registration