Saturday, April 20, 2024

క్రియాశీలతే పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

 ఇన్వెస్ట్ మెంట్ల ఆకర్షణకు చిత్తశుద్ధితో రాష్ట్రప్రభుత్వం కృషి ఎలాంటి
విపత్తునైనా ఎదుర్కొనేలా సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
సిఐఐ ఇండియా 75వ సమ్మిట్‌లో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, కంపెనీలను ప్రోత్సహించడానికి క్రియాశీల విధానాలు చాలా అవసరమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 6న గ్యాస్ ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి అనేక గుణపాఠాలు నేర్పించిందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు, కఠిన విపత్కాల సమయంలోనే ధైర్యంగా ఎదుర్కొనేందుకు అనేక సంస్కరణలు అవసరమన్నారు. ఇందుకు పెద్దఎత్తున ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిన అవసముందన్నారు.
శనివారం సిఐఐ ఇండియా 75వ సమ్మిట్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో ‘భారత్‌లో ఆధునిక టెక్నాలజీ- స్థానిక, ప్రపంచ స్థాయి నైపుణ్యం, సమన్వయం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, క్రియాశీల విధానాలను కేంద్రం మరింత ధైర్యంగా తీసుకోవాలన్నారు. కొవిడ్-19 సంక్షోభంలోనూ టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోనే డిజిటల్ సొల్యూషన్స్ అందుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ వర్క్ ఫోర్స్ ఇండియాలో ఉన్నదని, రెండు దశాబ్దాలుగా లీడ్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం దేశానికి ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,్ర ఇంక్లూజివ్ గ్రోత్.. ఈ మూడే కావాలని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్నిరంగాల్లోనూ సాంకేతిక నైపుణ్యత వినియోగం పెరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు ప్రయోజనకారిగా ఉందన్నారు. విద్యలో డిజిటల్ టెక్నాలజీ, ఆన్‌లైన్ రిటెయిల్, రోబోట్ డెలివరీల్లో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిందన్నారు. సమర్ధవంతమైన అభివృద్ధిలో 5జి కీలకమవుతుందన్నారు. మన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రపంచంలో టెక్నాలజీ లీడర్‌గా నిలబడాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎఐ, డ్రోన్, బ్లాక్ చైన్, క్లౌడ్ వంటివి అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

Minister KTR Participate in CII India 75th Summit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News