Saturday, April 20, 2024

పేదోళ్లను తిప్పలు పెట్టిన్రు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Rajanna Sircilla tour

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో మంత్రి కెటిఆర్ శనివారం పర్యటించారు. మెహినికుంట కెసిఆర్ నగర్ లో మంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్లను, ఓ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కులమత తేడా లేకుండా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేస్తున్నామని తెలిపారు. గూడు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్ దేనని మంత్రి చెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లలో ఒక గది కట్టి పేదోళ్లను తిప్పలు పెట్టిన్రు. ఒక్కపైసా ఖర్చు లేకుండా రూ. 5లక్షలతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ముందుచూపుతో పేదలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న ఆయన… రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 82 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం జరుపుకుంటున్నాయని వెల్లడించారు. 18వేల కోట్లతో పేదోళ్ల ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రతి గ్రామపంచాయతీకి నిధులు కేటాయించడంతో పాటు, వృద్ధులకు పింఛన్లు అందజేస్తున్నం. ప్రతి గ్రామంలో వైకుంఠదామ, డంపింగ్ యార్డ్, పల్లే ప్రకృతి వనం, రైతువేదికలు, ట్యాంకర్ ఏర్పాటు చేసినం. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకాలున్నాయా.? అని కెటిఆర్ ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ కృతితో కాళేశ్వరం నుంచి మానేరుకు గోదావరి నోళ్లొచ్చాయని మంత్రి కెటిఆర్ గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News