Home తాజా వార్తలు టెస్లా అధినేతను తెలంగాణకు ఆహ్వానించిన కెటిఆర్

టెస్లా అధినేతను తెలంగాణకు ఆహ్వానించిన కెటిఆర్

Minister KTR responds on elon musk comments

 

హైదరాబాద్ : టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా భారత్‌లోకి టెస్లా కార్ల ప్రవేశంపై కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎలన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. ప్రభుత్వంతో ఎదురవుతున్న సవాళ్ల కారణంగానే భారతదేశానికి రావడానికి ఆలస్యం అవుతుందని ఎలాన్ మస్క ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో టెస్లా అధినేత వ్యాఖ్యలపై తెలంగాణ పరిశ్రమల శాఖమంత్రి కెటిఆర్‌ స్పందిస్తూ.. ముందుగా భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ/ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి బోలెడు అవకాశాలున్నాయని, టెస్లా సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ టాప్ బిజినెస్ డెస్టినేషన్ గా ఉందని వెల్లడించారు. ఇక, మస్క్.. భారత్ లోకి టెస్లాను తీసుకురావడానికి ఇబ్బందులు ఉన్నయని ట్వీట్ చేయగా.. దానికి మంత్రి కెటిఆర్ పై విధంగా రిఫ్లై ఇచ్చారు.

Minister KTR responds on elon musk comments