Tuesday, April 16, 2024

పురపాలకశాఖపై మంత్రి కెటిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో పురపాలకశాఖపై ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని రైల్వే ప్రాజెక్టు పనులు, ఆర్ వోబీ, ఆర్ యూబీల నిర్మాణం, భూసేకరణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి వేగంగా చేపడుతోందన్నారు. పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ లకు సంబంధించిన పనులు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని, దక్షిణ మధ్య రైల్వే సహకారంతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైల్వేశాఖ కూడా జిహెచ్ఎంసి మాదిరిగా పనులు పూర్తి చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలన్నారు. వర్షకాలం నాటికల్లా ఎక్కువ చోట్ల రైల్వేకు సంబంధించిన పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ సమావేశంలో బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండి దానకిశోర్, మెట్రోరైల్ ఎండీ ఎన్ వి రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Minister KTR Review Meeting on Municipal Department

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News