Home తాజా వార్తలు కెసిఆర్ కృషితోనే తెలంగాణలో జలవిప్లవం : కెటిఆర్

కెసిఆర్ కృషితోనే తెలంగాణలో జలవిప్లవం : కెటిఆర్

Minister KTR Review On Food Processing Units హైదరాబాద్‌ : సిఎం కెసిఆర్ కృషి వల్లే తెలంగాణలో జల విప్లవం వచ్చిందని మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై తన సహచర మంత్రులతో కెటిఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణలో లక్షలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నీలి విప్లవం(మత్స్యపరిశ్రమ),, గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ), శ్వేత విప్లవం(పాడి పరిశ్రమ) కూడా రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ చొరవతో రాష్ట్రంలో గొర్రెల పెంపకం, చేప పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో వీటి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం వరి, పత్తి, మొక్కజోన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి చాలా పెరిగిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం లేదని, అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయితే వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరగడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. దీంతో రైతులకు ఆర్థిక స్వావలంబన, యువతకు జీవనోపాథి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయనున్నామని, ఇందు కోసం అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని కెటిఆర్ తెలిపారు.