Thursday, April 25, 2024

కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో మంత్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ అధికారులకు చెప్పారు. మే 3వరకు లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందని..కరోనా నివారణకు లాక్ డౌన్ పాటించడం ఒక్కటే మార్గమన్నారు. నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో 100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, అన్ని రహదారులను మూసేసి ఒకటే మార్గంలో పోలీసుల పహారలో తెరచి ఉంచాలన్నారు. ఎవరు కూడా బయటకు రావొద్దని, నిత్యావసర సరుకులు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకోవాలని, అనుమానితులు ఉంటే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని.. జిహెచ్ఎంసి, మెడికల్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కెటిఆర్ చెప్పారు.

Minister KTR Review with Officials on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News