Friday, April 26, 2024

ఈచ్ వన్ ప్లాంట్ వన్: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ఈచ్ వన్… ప్లాంట్ వన్ నినాదంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ పూల మొక్కలు, పండ్ల మొక్కలను ఇళ్లలో, విధుల్లో పెంచుకోవాలని ప్రభుత్వం తరుపున పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. బోయగూడలోని జిహెచ్‌ఎంసి పార్క్‌లో పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని లాఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పట్టణాలను అందించేందుకు పూల మొక్కలైనా సరే, నీడనిచ్చే పెద్ద చెట్లు అయినా సరే పెంచాలని విజ్ఞప్తి చేశారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ కొత్త కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం నాటిన మొక్కల్లో 85శాతం వరకు బతకలేకపోతే చర్యలు తీసుకునే విధంగా చట్టంలో పొందపర్చడం జరిగిందని, మొక్కలు చనిపోకుండా అందరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు.

Minister KTR Says Each One Plant One

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News