Home తాజా వార్తలు అభివృద్ధికి సహకరించండి : కెటిఆర్

అభివృద్ధికి సహకరించండి : కెటిఆర్

KTRహైదరాబాద్‌ : ప్రతిపక్షాలు విమర్శలు మాని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని ఐటి, పరిశ్రమల శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఐటి రంగంలో హైదరాబాద్ బెంగళూరును దాటిపోయిందని ఆయన చెప్పారు. ఐటి రంగంలో 17 శాతం వృద్ధి రేటును సాధించామని ఆయన పేర్కొన్నారు. ఐటి రంగంలో పని చేసే వారి సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకుందని చెప్పారు. ఐటి రంగ దిగ్గజాలు ఫేస్ బుక్, ఆపిల్, గూగుల్, అమెజాన్ తదితర సంస్థలు బెంగళూరును కాదని హైదరాబాద్ కు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. టిఎస్ఐపాస్ ద్వారా 12 లక్షల 67 వేల ఉద్యోగాలను సృష్టించామని ఆయన చెప్పారు. యుపిఎ, ఎన్ డిఎ ప్రభుత్వాలు ఐటిఐఆర్ కు ఒక్క పైసా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణలోని యువత కెసిఆర్ సర్కారుపై పూర్తి విశ్వాసంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Minister KTR Speech In Telangana Assembly