Tuesday, March 19, 2024

సంక్షోభంలోనూ రైతు సంక్షేమాన్ని మరవలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Tour in Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాకల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని మానేరు తీరాన రూ.5.15 కోట్లతో సకల సౌకర్యాలతో అధునాతన రైతు బజార్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. 2.84 ఎకరాల్లో రైతుబజార్ ను నిర్మించామని అధికారులు తెలిపారు. రైతుబజార్ లో మొత్తం 223 దుకాణ సముదాయాలను నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

అడ్డంకులు అధిగమించి కాళేశ్వరం నిర్మించామని గుర్తుచేశారు. గోదాంల సామర్థ్యాన్ని 50 లక్షల మెట్రిన్ టన్నులకు పెంచే దిశగా సిఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభంలోనూ రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం మరవలేదు. 5.60 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని కెటిఆర్ పేర్కొన్నారు. రైతుబంధు కింద 50 లక్షల మందికి రైతుల ఖాతాల్లో రూ.5.200కోట్ల జమ చేశాం. కరోనాతో చిరువ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు. వ్యాపారులు మార్కెట్ లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేందించానలి సూచించారు. వ్యవసాయ రంగానికి మహర్దశ పట్టనుందని, విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రైతును రాజును చేయడమే తెలంగాణ సర్కార్ సంకల్పమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News