Home తాజా వార్తలు నాయిని సేవలు చిరస్మరణీయం : కెటిఆర్

నాయిని సేవలు చిరస్మరణీయం : కెటిఆర్

Minister KTR Tributes To Nayani Narsimha Reddyహైద‌రాబాద్ : మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి కార్మికలోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం నాయిని ఎన్నో పోరాటాలు చేశారని ఆయన పేర్కొన్నారు. నాయిని ప్ర‌థ‌మ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కెటిఆర్ ఘ‌న నివాళుల‌ు అర్పించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నాయిని న‌ర్సింహారెడ్డి చిత్ర‌ప‌టానికి కెటిఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ు అర్పించారు. ఈ సందర్భంగా నాయిని సేవలను కెటిఆర్ కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ‌య్య‌, ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.