Thursday, April 25, 2024

సువాసనలు వెదజల్లే వెండి చీర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నేతన్న కళాకారుల ప్రతిభకు పుట్టినిల్లయిన సిరిసిల్లలో నేత కళాకారుడు నల్లా విజయ్ మరొక అద్భుతమైన కళను ఆవిష్కరించారు. ఇప్పటికే తన నేత ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న విజయ్ ఈసారి సువాసనలు వెదజల్లే వెండి చీరలను మగ్గంపై నేశారు. నేత కళాకారుల ప్రతిభను వెన్నుతట్టి ప్రోత్సహించే మంత్రి తారక రామారావు చేతుల మీదుగా ఆ వెండి చీరలను శనివారం ఆవిష్కరింపజేశారు. సుగంధ ద్రవ్యాలు, వెండితో తాను చీరను తయారు చేసినట్టు మంత్రికి తెలిపిన విజయ్…. దాదాపు నెలన్నర రోజులపాటు ఈ చీరపైనే పనిచేసినట్లు చెప్పారు. ఇప్పటిదాకా విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు.

నేత కళాకారుడు విజయ్‌తో మాట్లాడిన మంత్రి కెటిఆర్… అతని కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. తెలంగాణ నేతన్నల అనితర సాధ్యమైన, అద్భుతమైన ప్రతిభకు విజయ్ నిదర్శనం అన్నారు. సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అభిలాషించారు. విజయ్ కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తానని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News