పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న కెటిఆర్
హైదరాబాద్: నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ. 28.38 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు పనులను మంత్రి ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారు. బాగ్‌లింగంపల్లి లంబాడీ తండాలో రూ.10.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 126 డబుల బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించున్నారు. అదేవిధంగా రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అడిక్‌మెట్‌లో నిర్మించిన మల్లీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభిస్తారు.
వీటితో పాటు రూ.9.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌లో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి సైతం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేయనున్నా రు. ఈకార్యక్రమాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ బొంతురామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ లతో పాలు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు.
Minister KTR Visit To Hyderabad Today