Thursday, March 28, 2024

అందరినీ ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

Minister KTR visits flood affected areas

 

ఏ ఒక్క వరద బాధితుడికి అన్యాయం జరగనివ్వం

ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు
జీవితాలకు ముప్పు తెచ్చే అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలను సహించేది లేదు
ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు
వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో
రోజు మంత్రి కెటిఆర్ పర్యటన
ముంపు ప్రాంతాల ప్రజలకు ధైర్యం చెపుతూ, మృతుల కుటుంబాలకు ఓదారుస్త్తూ భరోసానిచ్చిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్/ రాజేంద్రనగర్ : వరద ముంపుకు గురైన బాధితులను కంటికి రె ప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర పురపాలక శా ఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఇందులో ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆ యన భరోసానిచ్చారు. వరద ఉధృతిలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వంమే తిరిగి నిర్మించి ఇస్తుందన్నారు. ప్రజల ప్రాణాలతో పాటు వారి ఆస్తుల రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రాణ నష్టం కన్న విలువైనది ఏమిలేదని, ప్రాణాలను తీసే వి ధంగా ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూ ల్చివేయాలని ఆదేశించారు. చెరువులు, కుం ట ల స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని, అలా ంటి వారి పై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు. వరద ముంపు ప్రాంతా ల్లో వరసగా నాలుగవ రోజైన శనివారం మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పలు ప్రాంతాల్లో బాధితులను కలుసుకుని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వరదల్లో చనిపోయిన పలువురికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులనుఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపిలు రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసి, స్థానిక శాసనసభ్యుడు టి. ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. ప్రాణ నష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందన్నారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపైన ప్రధానంగా దృష్టి సారించి పని చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలన్నారు.

ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు

ఇటీవల భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు తెగి జలమయం అయిన బస్తీలు, కాలనీల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్టా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్ల్లు మంత్రి వెల్లడించారు. వరద కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వ్యాధులు రాకుండా, గాయాల పాలైన వారికి వైద్య సాయం అందించేలా క్యాంపులు పని చేస్తామని తెలిపారు ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News