Friday, March 29, 2024

బాసరకు భరోసా

- Advertisement -
- Advertisement -

3 children died after drowned in pit in shadnagar

విద్యార్థులు ఎంచుకున్న ఆందోళన మార్గం నచ్చింది
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ఏటా ఇన్నోవేషన్ వారోత్సవాలు
సిఎం ఆదేశాలతోనే మేమంతా ఇక్కడకు వచ్చాం
రూ.3కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం 
వెయ్యి కంప్యూటర్లతో ఆధునిక ల్యాబ్
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులతో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ బాసర, బైంసా/హైదరాబాద్: దేశంలోనే బాసర ట్రిపుల్ ఐటిని ఒక మోడల్ క్యాంపస్‌గా మార్చుకుందామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని ఎంఐటి వలే ఈ క్యాంపస్ ఐటి మారాలన్నారు. ఎంఐటి ల్యాబ్ నుంచి వచ్చిన కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయన్నా రు. ఈ నేపథ్యంలో ఉద్యమ కలిసి అం దరం కలిసి పనిచేద్దామన్నారు. ఈ కళాశాలలో నె లకొన్న సమస్యలపై విద్యార్థులు ఎంచుకున్న పద్ధ్ద తి తనకు బాగా నచ్చిందన్నారు. ప్రభుత్వం మౌలి క వసతులు కల్పించినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మళ్లీ నవంబర్‌లో కళాశాలకు విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు ఇవ్వడానికి వస్తానని అన్నా రు. అప్పటిలోగా దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టమైన హామీ ఇచ్చారు. సోమవారం బాసర ట్రిపుల్ ఐటిని మంత్రి కెటిఆర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఆయన లంచ్ చేశారు. అనంతరం వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రస్తుతం కళాశాల్లో నెలకొన్న సమస్యలు, వివిధ అంశాలపై తనకు పూర్తి సమాచారం, అవగాహన ఉందన్నారు. క్యాంపస్ అభివృద్ధితో పాటు ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమం త్రి కెసిఆర్ సహకారంతో, విద్యా శాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డితో సమన్వయం చేసుకొని ట్రిపుల్ ఐటిని అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ట్రిపు ల్ ఐటిలో టి సెంటర్ ఏర్పాటుతో మి నీ స్టేడియం, అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏ ర్పాటు చేస్తానన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయడం, ఆధునాతన క్లాస్ రూముల వంటి అంశాలపైన తానే పూర్తి బాధ్యత తీసుకొని వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కెటిఆర్ తెలిపారు. విద్యార్థ్ధులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు. విద్యార్థులు తయారుచేసిన ఉత్పత్తులతో ప్రతి సంవత్సరం వారం రోజు లు ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలని ఈ సందర్భంగా కెటిఆర్ అభిలషించారు. పరిశోధనలే నవీన ఆవిష్కరణల కు ఊతం ఇస్తాయన్నారు. ఆవిష్కరణలతో కంపెనీలే కా కుండా నుంచి ఉద్యోగాలు, సంపద వస్తుందన్నారు.
పోరాట స్పూర్తి నచ్చింది
కళాశాలలో నెలకొన్న సమస్యలపై వారం రోజుల పాటు మంచి స్ఫూర్తితో పోరాడారని విద్యార్ధులను కెటిఆర్ ప్రశంసించారు. కేవలం సమస్యల కోసం ఆందోళన చేసిన మీరు అందులో రాజకీయ పార్టీలకు తావు ఇవ్వకపోవడం మరింతగా నచ్చిందన్నారు. ముఖ్యంగా గాంధీజీ సత్యాగ్రహ పద్దతిలోనే శాంతియుతంగా వానలో కూడా బయట కూర్చోని ఆందోళ చేశారని మెచ్చుకున్నారు. కేవలం రాష్ట్ర సర్కార్ దృష్టిని ఆకర్షించడానికే ఆందోళన చేస్తున్నామని చెప్పారన్నారు. అందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నానని అన్నారు. సమస్యలు అపరిష్కృతంగా ఉంటే ప్రజస్వామికంగా పోరాడొచ్చునని అన్నారు. కొవిడ్‌తో రెండేళ్లు క్యాంపస్ బంద్ అయిందని…అందువల్ల మళ్లీ పట్టాల మీదికి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు.
మీకు భరోసా ఇచ్చి రమ్మని సిఎం ఆదేశించారు
విద్యార్థులు అడిగిన ప్రతి విజ్ఞప్తిని అంగీకరించినట్లు సిఎం కెసిఆర్ తమకు చెప్పారన్నారు. మీరందరు వెళ్లి వారికి భరోసా ఇచ్చి రమ్మని ఆదేశించారన్నారు. అందుకే తామంతా ఇక్కడకు వచ్చామని కెటిఆర్ పేర్కొన్నారు. నవంబర్‌లో విద్యార్ధులందరికి ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామన్నారు. అలాగే రూ. 3 కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. ఆరు నుంచి ఎనిమిది నెలలలోపు అది పూర్తవుతుందన్నారు. 1000 కంప్యూటర్ లతో ఆధునిక డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 50 అదనపు ఆధునాత తరగతులు, ఆధునాతన ఫర్నీచర్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామన్నారు. కాగా బోధన ఇంకాస్త మెరుగు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మంత్రి కెటిఆర్‌ను కోరారు. అలాగే కొత్త టెక్నాలజీపై కోర్సులను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆరునెలలకు ఒకసారి ట్రిపుల్ ఐటికి వస్తానని, మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
ఆ బాధ్యత మీదే.. నాకు హాస్టల్ కష్టాలు తెలుసు
బాసర్ ట్రిపుల్ ఐటి క్యాంపస్ మీదేనని…దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని కెటిఆర్ అన్నారు.
తెలంగాణలోని అద్భుత ప్రతిభ కల విద్యార్థులే ఇక్కడ చదువుకుంటున్నారన్నారు. ఈ కళాశాలలో సీటు ఇప్పియ్యాలని తన రాజకీయ జీవితంలో ఎన్నో పైరవీలు వచ్చాయన్నారు. కాని మెరిట్ ఉంటేనే సీటు వస్తుందని చెప్పానని కెటిఆర్ అన్నారు. ఎన్నో ఆశలతో బాసర ట్రిపుల్ ఐటికి వచ్చి ఉంటారని… కాని ఆశించిన స్థాయిలో వసతులు లేకపోవడంతో బాధపడ్డారన్నారు. ఎన్‌ఐటి, ఐఐటి లకు ధీటుగా ట్రిపుల్ ఐటిని తయారుచేయమని విద్యార్థులు కోరారు. తాను కూడా హాస్టల్‌ల్లో ఉన్నవాడినేనని కెటిఆర్ అన్నారు. అందువల్ల హాస్టల్ కష్టాల గురించి పూర్తిగా తనకు తెలుసన్నారు.70 శాతం తన జీవితం హాస్టల్లోనే గడిచిందన్నారు. అయితే వీటిని పరిష్కరించేందుకు కొంత సమయం ఇవ్వండని విద్యార్ధులను కోరారు. ఇక్కడ పాతుకుపోయిన మనుషుల్ని, వ్యవస్థల్ని అర్థంచేసుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. మెస్ టెండర్లు కొత్తగా పిలిచామని…అయితే అంతగా స్పందన రాలేదన్నారు. మరొకసారి పిలుస్తున్నాము. చిత్తశుద్దితో తమ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చిన్నతనం నుంచే డాక్టర్, ఇంజనీర్ కావాలని ఏదో ఒక ఉద్యోగం వస్తుందని పిల్లలకు నూరిపోస్తరన్నారు. బాగా చదువుకుంటే మంచి భర్త వస్తడని ఆడపిల్లలకు చెపుతరన్నారు. కానీ నువ్వు వేరే వాళ్ల దగ్గర ఉద్యోగం చెయ్యడం ఎందుకు? పది మందికి ఉద్యోగాలు ఇచ్చేలా నువ్వే ఎందుకు మారవు? అని చెప్పే సంస్కృతి మనదేశంలో లేదన్నారు.
ఎవరి కిందనో పనిచేయాలా?
ఇన్‌స్టా గ్రాం, ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు మనకు అర్థం కాని బ్రహ్మపదార్థాలు ఏ మాత్రం కాదన్నారు. కాని వీటిని మన భారతీయులు మాత్రం కనిపెట్టలేదు. 140 కోట్ల మంది భారతీయులు ఎవరి కిందనో పనిచెయ్యాలా? అని ప్రశ్నించారు. అమెరికా నుంచి ప్రపంచాన్ని ఆకర్షించే ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. మనం గానుగ ఎద్దులలాగా పనిచేద్దమా? ఇలాంటివి కొత్తవి ఏదన్నా కనుకొందామా? అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇన్నోవేషన్ అంటే ఎవరికి అర్థం కానిది కాదన్నారు. మనకు దైనందిత జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమన్నారు. గూగుల్ కనిపెట్టుడు మాత్రమే ఇన్నోవేషన్ కాదు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఒక చిన్నారి చేసిన ఇన్నోవేషన్ గురించి కెటిఆర్ చెప్పారు.
కొత్త ఆవిష్కరణలు రావాలి
అతి తక్కువ జనాభా ఉన్న అమెరికా నుంచి ఆకర్షించే ఉత్పత్తులు వస్తున్నాయి. అత్యంత జనాభా ఉన్న మన దేశం నుంచి ఉత్పత్తులు రావడం లేదు ఎందుకు. ఉద్యోగం చే యడం కాదుఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి. ఇన్నోవేషన్ అంటే ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం కా దు. విద్యార్థుల నుంచే కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రతిసంవత్సరం ఇన్నోవేషన్ వారోత్సవాలు ఇక్కడ జరగాలి. ఇక్కడి నుంచే కొత్త ఆవిష్కరణలు రావాలి. ఉత్పత్తిలో సత్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఐటి, విద్యాశాఖ సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు.

Minister KTR Visits IIIT Basara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News