Tuesday, April 23, 2024

యువత భౌతిక దూరం పాటించడం లేదు.. చర్యలు తీసుకుంటాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

సిరిసిల్ల రాజన్న: అమెరికా కూడా కరోనాను తట్టకోలేకపోయిందని, శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం కెటిఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు. కరోనా వైరస్ కు స్వీయ నియంత్రణే మందని చెప్పారు. కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని, జిల్లాలో ఒక్క పాజిటీవ్ కేసు మాత్రమే నమోదైందన్నారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. మెట్టప్రాంతమైన సిరిసిల్లో కూడా ధాన్యం కొనుగోళ్ళ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పండించిన ప్రతీ గింజను కొనుగొలు చేస్తామని అన్నారు. పల్లెలో భౌతిక దూరం పాటిస్తున్నారు.. కానీ, పట్టణాల్లో యువత పాటించడం లేదన్నారు. అధికారులకు సహకరించాలని.. లేకపోతే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో రెండు వారాలు ప్రజలు సహకరించాలని, త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుందామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

Minister KTR visits Rajanna Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News