Thursday, April 25, 2024

నామినేటెడ్ పదవులు

- Advertisement -
- Advertisement -

త్వరలోనే నియామకం జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పాల్గొని పార్టీకి సేవ చేసిన వారందరికీ న్యాయం
జరుగుతుంది ప్రతి మండలంలో టిఆర్‌ఎస్ కార్యాలయం, అనాథ శరణాలయం : సిరిసిల్ల ఆకస్మిక
పర్యటనలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ ప్రకటన

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: ప్రతి మండలంలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని, అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేస్తామని టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గురువారం తన స్వంత నియోజకవర్గమైన సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశాలపై పార్టీ శ్రేణులతో మంత్రి చర్చించారు. నియోజకవర్గంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రగతిని పరిశీలించారు. తన క్యాంపు కార్యాలయంలో పలువురు కార్యకర్తలతో మాట్లాడి వారి నుండి వినతులు స్వీకరించారు. వారితో సరదాగా మాట్లాడుతూ మంత్రి సెల్ఫీలు దిగారు. ఇటీవల జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన టిఆర్‌ఎస్ నాయకులను మంత్రి పేరుపేరునా పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించే అలోచనలో ఉన్నామని, అందుకోసం కనీసం వంద గజాల స్థలాన్ని అయినా సమీకరించాలని సూచించారు.

సిరిసిల్ల ప్రాంతంలో ప్రజల జీవన స్థితిగతులపై, వారి పేదరికం, వారి గృహలేమి పరిస్థితులపై మీడియాలో వస్తున్న కథనాలు తనకు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. అందువల్ల ప్రతి మండలానికి ఒక అనాథ శరణాలయాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన తెరాస నాయకుల సేవలను పార్టీ గుర్తిస్తుందని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుందన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను అందిస్తామన్నారు. పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో మంచి గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్పీ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణ భాస్కర్, టిఆర్‌ఎస్ జిల్లా ఇంఛార్జి తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పలువురు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Minister KTR visits Siricilla District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News