Home నిజామాబాద్ పేదలకు నాణ్యమైన వైద్యం

పేదలకు నాణ్యమైన వైద్యం

laxma-reddyరూ.17.50 కోట్లతో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
ఏడాదిలో ఆసుపత్రిని పూర్తి చేస్తాం
గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించాయి
ప్రజల మేలుకొరకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చర్నకోల లకా్ష్మరెడ్డి వెల్లడి
రైతుల కడుపులో బుల్లెట్లు దించిన ఘనత టిడిపిదే: ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్‌రెడ్డి

ఆర్మూర్ అర్బన్: వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి పరిచి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చర్నకోల లకా్ష్మరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.17.50 కోట్లతో నిర్మించే 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆదివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ… 30 పడకల ఆసుపత్రిగా ఉన్న ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తున్నామని, ఏడాదిలో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీంతో పేద ప్రజలకు వైద్యం అందలేదనే సమస్య ఉండదన్నారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్షం చేశాయని, 60 ఏళ్లు పాలించినా చేయలేని పనులను కేవలం 60 నెలల్లో చేసి చూపిస్తామని ఆయన తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని ఆసుపత్రులకు బడ్జెట్ కేటాయిస్తున్నామని, జిల్లా ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ కూడా లేని దుస్థితిలో ఉందన్నారు. వైద్య రంగాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యం తో సిఎం కెసిఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని వేశారని, ఈ కమిటీలో నాతో పాటు కెటిఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు ఉంటారని, కమిటీ ఆధ్వర్యంలో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చలు జరుపుతున్నామని, తొందరలోనే కమిటీ అధ్యయనం చేసి సిఎంకు పూర్తి నివేదికను సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పట్ల పూర్తి అవగాహన కలిగిన సిఎం ఉండడం మనందరం చేసుకున్న అదృష్టమని, తెలంగాణను తీసుకురావడమే కాదు పునర్నిర్మాణం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆసరాగా టిఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సాగునీటి విషయంలో గత ప్రభు త్వాలు పూర్తి నిర్లక్షం వహించాయని, కృష్ణా, గోదావరి జలాలు సము ద్రంలో కలుస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రజల మేలుకొరకే ప్రాణహి త-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మార్చామని, గత ఆంధ్రా పాలకుల కుటిల బుద్ధిని సిఎం కెసిఆర్ త్వరలోనే బయటపెట్టనున్నారన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని ఆటంకాలు కల్పించినా వాటర్ గ్రిడ్‌ను పూర్తి చేసి తెలంగా ణలో ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. బలం లేక బిజెపి, టిడిపి, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ కలిసి రైతు బంద్‌కు పిలుపునిచ్చినా రైతులు, ప్రజలు తిరస్కరించారని ఆయన తెలిపారు.

కార్పొరేట్ స్థాయిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం: ఆర్మూర్ ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్‌రెడ్డి
ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తామని ఆర్మూర్ ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పర్యటనలో సిఎం కెసిఆర్ హామీ ఇచ్చిన విధంగానే వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టామన్నారు. గత ఆంధ్రా ప్రభుత్వాలలో మాదిరిగా పనికిమాలిన మంత్రులు లేరని, నేడు మంత్రులు ప్రతి జిల్లాకు తిరుగుతూ ప్రజా సమస్యలను తీరుస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత పాలకులు చేయలేని, చేతకాని పనులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోందని, ప్రతిపక్షాలకు మతిస్థిమితం కోల్పోయి బంద్, పాదయాత్రలు నిర్వహిస్తు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాయన్నారు. తెలంగాణలో 36 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశామని, రైతుల రుణమాఫీని ఏకకాలంలో తీర్చడానికి బ్యాంకర్లతో చర్చిస్తున్నామని, రైతులు ఆత్మహత్యలు చేసుకో వద్దని ఆయన కోరారు. గత ప్రభుత్వాల ఇన్‌పుట్ సబ్సిడీ 2009-2015 వరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వమే చెల్లించిందని, ఎర్రజొన్న బకాయిలు అడిగితే రైతుల కడుపులో బుల్లెట్లు దించిన ఘనత టిడిపికి ఉందని ఆయన గుర్తు చేశారు.

ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి లబ్ది చేకూరాలన్నదే సిఎం ఉద్ధేశ్యమన్నారు. అమరుల త్యాగ ఫలితం, సకల జనుల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నాం, ఖబర్ధార్ బలరాం నాయక్ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే తెలంగాణలో కాలుపెట్టనివ్వమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి సిఇ, ఎస్‌ఇలు లకా్ష్మరెడ్డి, దేవేందర్‌కుమార్, డిఎం అండ్ హెచ్‌ఓ జె.వెంకటి, మున్సి పల్ చైర్మన్ కశ్యప్ స్వాతిసింగ్, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఎంపిపి పోతు నర్సయ్య, జడ్‌పిటిసి సాందన్న, టిఆర్‌ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీ ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్లు నారాయణ, బాబురావు, నాగరాజ్, టిఆర్‌ఎస్ నాయకులు కలిగోట గంగాధర్, పండిత్ ప్రేమ్, కొక్కుల రమాకాంత్, పోల మధుకర్, బోండ్ల సుజాత సంతోష్, వన్నెల్‌దేవి లత, లత జో శ్రీనివాస్, సుంకరి రంగన్న, పోశెట్టి, రాజాబాబు, యామాద్రి భాస్కర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.