Home తాజా వార్తలు చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి

చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి

మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల చిన్నారి అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితున్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్‌ను రాష్ట్ర హోమంత్రి మహమ్మద్ ఆలీ ఆదేశించారు. ఈ ఘోరానికి పాల్పడిన శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన నిందితుడు పొలిపాక ప్రవీణ్‌ను ఈనెల 19న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రాధమిక నివేదికను హోంమంత్రికి అందజేశారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసులో గత కొద్ది కాలంగా హన్మకొండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్‌గా పనిచేసేవాడని, నిందితుడు ఈనెల 18న అర్థరాత్రి సమయంలో హన్మకొండ కుమార్‌పల్లిలో తల్లితో మేడపై నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అదే ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన విషయం పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.

చిన్నారి మామయ్య హన్మకొండ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేసి సెక్షన్ 366,302,376(ఎబి), 379 ఐపిసిలతో పాటు పోక్సో చట్టం 2012 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించడానికి చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని, ఈకేసులో వేగవంతంగా దర్యాప్తు చేపట్టి శిక్ష పడేటట్లు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్ చేసే విషయంపై ప్రతిపాదనలు చేయాలని వరంగల్ పోలీసు కమిషనర్‌కు హోంమంత్రి మహమ్మద్ మహ్ముద్ ఆలీ ఆదేశించారు.

minister Mahmood Ali serious on 9 months baby rape