Home Default యాదాద్రి స్వామికి 3కిలోల బంగారం విరాళంగా ఇచ్చిన మల్లారెడ్డి

యాదాద్రి స్వామికి 3కిలోల బంగారం విరాళంగా ఇచ్చిన మల్లారెడ్డి

Minister Malla Reddy Visits Yadadri Templeయాదాద్రి భువనగిరి : రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహాస్వామి ఆల‌య విమాన గోపురం బంగారం తాప‌డం కోసం మూడు కిలోల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ గోపురం కోసం విరాళాలు అందించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చిన క్రమంలో స్వామివారికి భూరీ విరాళాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి మూడు కిలోల బంగారం విలువ చేసే నగదను ఆలయ అధికారులకు అందించారు. మేడ్చల్ నియోజక వర్గం తరపున ఈ మొత్తాన్ని అందించినట్టు మల్లారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలతో వెళ్లి యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మల్లారెడ్డికి ఆల‌య ఈవో గీత‌, అర్చ‌కులు స్వాగతం ప‌లికారు. అనంత‌రం ఆ న‌గ‌దును అధికారులకు మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.  మంత్రి మ‌ల్లారెడ్డి మొత్తం రూ. 1.75 కోట్ల న‌గ‌దును అదికారులకు అందించారు. ఇందులో రూ. కోటి నగదు కాగా, రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి.