Thursday, April 25, 2024

నేతలపై కొవిడ్ పడగ

- Advertisement -
- Advertisement -

మంత్రి మల్లారెడ్డి దంపతులకు వైరస్
ఎల్‌బినగర్, తాండూర్ ఎంఎల్‌ఎలు సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలకు పాజిటివ్
రాష్ట్రంలో ఒకే రోజు 2256 కొత్త కేసులు
జిల్లాల్లో 1792, జిహెచ్‌ఎంసిలో 452 మందికి వైరస్, మరో 14మంది మృతి
గాంధీలో చికిత్సపొందుతూ పాత్రికేయుడు మృతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టులు 6 లక్షలకు చేరువయ్యాయి. శుక్రవారం చేసిన 23,322 టెస్టులను కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,90, 306 టెస్టులు చేసినట్లు వైద్యారోగ్యశాఖ బులెటెన్‌లో పేర్కొన్నారు. కొత్తగా 2256 కేసులు నమోదు కాగా, వీరిలో జిహెచ్‌ఎంసిలో 464 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 26, భద్రాద్రి 79,జగిత్యాల 49, జనగాం 18, భూపాలపల్లి 38,గద్వాల 95, కామారెడ్డి 76, కరీంనగర్ 101,ఖమ్మం 69, ఆసిఫాబాద్ 0,మహబూబ్‌నగర్ 45 , మహబూబాబాద్ 23, మంచిర్యాల 44, మెదక్ 14, మేడ్చల్ మల్కాజ్‌గిరి 138, ములుగు 20, నాగర్‌కర్నూల్ 13, నల్గొండ 61, నారాయణపేట్ 9, నిజామాబాద్ 74, పెద్దపల్లి 84,సిరిసిల్లా 78, రంగారెడ్డి 181, సంగారెడ్డి 92, సిద్ధిపేట్ 63, సూర్యాపేట్ 25, వికారాబాద్ 13,వనపర్తి 19, వరంగల్ రూరల్16, వరంగల్ అర్బన్ లో 187, యాదాద్రిలో మరో 24మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 14 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 77,513కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య54,330కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 22,568 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 15,830మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 615కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి….
కోవిడ్ దాడిలో మాజీ ఎంపి నంది ఎల్లయ్య మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రిందట దగ్గు, జ్వరం, వంటి లక్షణాలు ఉండటంతో టెస్టులో పాజిటివ్ తేలింది. దీంతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ ఈస్ట్ టీ న్యూస్ రిపోర్టర్ కూడా మరణించినట్లు సమాచారం.
మంత్రి మల్లారెడ్డి దంపతులకు కోవిడ్…
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి కోవిడ్ సోకింది. మూడు రోజుల క్రితం దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆయన టెస్టు చేపించుకోగా కోవిడ్ తేలింది. దీంతో పాటు ఆయన భార్యకు కూడా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఎల్‌బినగర్ ఎంఎల్‌ఏ సుధీర్‌రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులకూ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్యవర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు తాండూర్ ఎంఎల్‌ఏ ఫైలట్ రోహిత్ రెడ్డికి శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ అపొలో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు.

Minister Mallareddy Test positive for Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News