Friday, April 19, 2024

రైతుల మెడపై కేంద్రం కత్తి పెట్టింది: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

minister niranjan reddy comments on agriculture bill

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై మంత్రి నిరంజన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల మెడపై కేంద్ర కత్తిపెట్టిందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కార్పొరేట్ వ్యాపారుల లబ్ధి కొరకే కొత్త బిల్లులు తెచ్చిందని చెప్పారు. బిల్లుల్లో కనీస మద్దతుధర గురించి ప్రస్తావనే లేదు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. రైతు ఉత్పత్తులపై కార్పొరేట్ల గుత్తాధిపత్యం పెరిగే అవకాశముందన్నారు. ధరల నియంత్రణ కార్పొరేట్ శక్తుల చేతిల్లోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లు, రైతులకు వివాదాలు తలెత్తితే పరిష్కరించేదేవరు?. వివాదాలు వస్తే సాధారణ రైతు బడా కార్పొరేట్ వ్యవస్థతో పోరాడగలడా?. కొత్త బిల్లు వల్ల మార్కెట్ కమిటీలు అలంకారప్రాయంగా మారతాయని మంత్రి పేర్కొన్నారు.

minister niranjan reddy comments on agriculture bill

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News