Home తాజా వార్తలు కోటి ఎకరాల మాగాణి కెసిఆర్ లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి

కోటి ఎకరాల మాగాణి కెసిఆర్ లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy Foundation to Khan Pond Liftవనపర్తి : సాగు నీరు అందించి తెలంగాణలో కోటి ఎకరాలను మాగాణిగా మార్చడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. జిల్లా పరిధిలోని పెద్దగూడెం వైకుంఠధామాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఖాన్ చెరువుకు నీళ్లు  నింపే లిఫ్ట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగుకు అనుగుణంగా ఉన్న ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్దగూడెం కల నెరవేరిందని, ఈ ప్రాంత రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ,  ఖాన్ చెరువు ద్వారా 1500 ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. రూ.79 లక్షలతో హెచ్ పి మోటారును ఏర్పాటు చేసి , లిఫ్ట్ ద్వారా ఖాన్ చెరువుకు నీరందిస్తామని ఆయన వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకునే విపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.